Sanju Samson: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన టీమిండియాకు ఓపెనర్ సంజు శాంసన్ (Sanju Samson) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. విండీస్ బౌలర్లపై తొలి బంతి నుంచే విరుచుకుపడిన శాంసన్.. కేవలం 20 బంతుల్లోనే కిరాక్ అర్ధశతకం బాది ఆకట్టుకున్నాడు. టీమిండియా స్కోరు 5 ఓవర్లలో 60 పరుగులు వద్ద ఉన్న సమయంలో సంజు 23 బంతుల్లో 56 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
రోస్టన్ చేజ్, షమర్ జోసెఫ్లకు చుక్కలు చూపించిన సంజు: