సర్(SIR) ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సరిదిద్దుకునే పనిలో పడింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో యువ ఓటర్ల నమోదుకు నిర్వహించాల్సిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) ప్రక్రియను ఇప్పుడు నిర్వహించేందుకు సిద్దమైంది. 17 రాష్ట్రాల్లో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు లేఖ రాసింది. జనవరి 1, 2027 లోపు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాతో సహా సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో 2027 జనవరి 1వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్(SSR) ప్రక్రియను…
స్పెషల్ సమ్మరీ రివిజన్(SSR) ను ప్రతియేటా కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కొత్త ఓటు హక్కుకు అర్హత పొందిన యువతకు మొదటి సారిగా ఓటే వేసేందుకు ఓటర్లుగా నమోదు అవకాశం కల్పిస్తారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ఓటర్ల లిస్టులో తప్పులను సరిదిద్దడం, ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా తాజాగా ఉండేలా చేయడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.