న్యూఢిల్లీ, అక్టోబర్ 15: భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తామని గురువారం విలేకరుల సమావేశంలో సీజేపీ పేర్కొంది. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న తమ డిమాండ్‌ను కూడా సీజేపీ పునరుద్ఘాటించింది. అక్టోబర్ 23 నుంచి తాము నిరసనను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ తెలిపింది. ఈ ఆందోళనలో…
జ్ఞానేశ్ కోసం సొంత పౌరులపైనే యుద్ధమా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం ఆరోపించారు. ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా, నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీకి చెందిన యువత అంతా వీధుల్లో పోరాడుతున్నారు. వారిని వీధుల వెంట ఈడ్చుకెళ్లారు. ఆయేషాను ఈడ్చుకెళ్లారు. విలాజ్ను ఈడ్చుకెళ్లారు. ఇషాను ఈడ్చుకెళ్లారు. ఎవరి కోసం? జ్ఞానేశ్ కుమార్ అనే ఒక్క వ్యక్తిని కాపాడటం కోసం అని దీప్కే ఆరోపించారు. ప్రభుత్వం తన సొంత పౌరులపైనే యుద్ధంచేస్తున్నదని ఆయన అన్నారు. ఒక నియంత అధికారంలో…