హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు, పేరుతో ఫేక్ అకౌంట్లు తెరిచి.. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా 13 ఇన్స్టాగ్రామ్, 14 ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లతో వెయ్యి మందికి వల విసిరాడు. కవ్వింపు చాటింగ్‌తో వలలోకి లాగాడు. పర్సనల్, న్యూడ్ ఫొటోలు, వీడియోలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడు. 82 మందిని బెదిరించి దాదాపు రూ.25లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన కొండబత్తుల పవన్ కుమార్ (23)ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి మూడు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్…
సోమవారం చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. పవన్ బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చదువుతూ మధ్యలోనే మానేశాడు. ప్రస్తుతం కూకట్పల్లి బాలాజీనగర్‌లో ఉంటున్నాడు. గతంలో బషీర్‌బాగ్‌లోని డిజీ లోన్స్ అనే సంస్థలో పనిచేశాడు. అక్కడ రూ.16 వేల జీతం అడ్వాన్స్ తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే పవన్.. ఆన్లైన్లో అమ్మాయిల ఫొటోలు సేకరించి నకిలీ ఖాతాలు తెరిచేవాడు. వాటి ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. స్పందించిన వారితో వయసుకు తగ్గట్టుగా చాటింగ్ చేస్తూ…