మెదక్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం