చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. రావణాసురుడిపై రాముడి విజయం, మహిషాసురుడిపై అమ్మవారి విజయం మనకు అందించే సందేశం ఒకటే.. అడ్డంకులెన్ని ఎదురైనా మంచిని గెలిపించుకోవాలి. మరి మన జీవితంలోనూ విజయం సాధించాలంటే… అనారోగ్యపు అలవాట్లపై ఆరోగ్యకరమైన జీవనశైలి విజయం సాధించాలి. ఒత్తిడిపై ప్రశాంతత, బద్ధకంపై చురుకుదనం, అజాగ్రత్తపై ఆరోగ్య సృ్పహ గెలవాలి. పండుగనాడు కొత్త దుస్తులు ధరించినట్లే.. కొత్త ఆరోగ్య అలవాట్లనూ ఆహ్వానించాలి. ఆరోగ్యం అంటే జబ్బులు లేకపోవడమే కాదు.. ఉత్సాహంగా పనిచేయగలగడం, మనస్ఫూర్తిగా నవ్వగలగడం, కుటుంబంతో ఆనందంగా గడపగలగడం కూడా! ఈ విజయదశమికి మనకు మనం ఇచ్చుకునే విలువైన కానుక.. ఆరోగ్య…