హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల ఫలితాలను కొన్నిచోట్ల తారుమారు చేసేందుకు లేబర్ కమిషన్ అధికారులు కుట్రలకు పాల్పడ్డారని ఆర్టీసీ కార్మిక నేతలు పెత్త ఎత్తున ఆరోపిస్తున్నారు. ఫలితాల విడుదలలో జాప్యంచేసిన అధికారులు.. పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. క్లాజ్-6లోని నాలుగు రీజియన్లలో స్థానిక గుర్తింపు సంఘాన్ని ఖరారు చేసే విషయంలో అవకతవకలు జరిగాయని తెలిపారు.
ఈ ఫలితాలను తారుమారు చేయడంలో లేబర్ కమిషన్కు చెందిన ఓ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ అధికారి అధికార పార్టీకి తొత్తుగా మారి ఫలితాలను తారుమారు చేయడాన్ని నిరసిస్తూ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఈదురు వెంకన్న, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు థామస్రెడ్డి, ఇతర నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కార్మిక శాఖ అధికారుల తీరుకు నిరసనగా నిరసనలకు వారు…