Abhilasha Godishala | అక్టోబర్ 17న వెలుగు దినపత్రిక మొదటిపేజీలో ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ పేరిట తప్పుడు కథనాన్ని ప్రచురించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేస్తున్నతప్పుడు ప్రచారంపై ఖండాంతరాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వెలుగు’ దినపత్రిక ప్రచురించిన కేసీఆర్ ఫామ్‌హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ తప్పుడు కథనాన్ని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అధికారిక ఆధారాలు లేకుండా సంచలన శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమంజసం కాదని, సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా సంచలనం కోసo, రాజకీయ దురుద్దేశంతో ఈ కథనాన్ని ప్రచురించారని అభిలాష గొడిశాల విమర్శించారు.