భార్యాభర్తలు ఇద్దరూ ఐటీ ఉద్యోగులే...మూడేళ్ళ క్రితమే పెళ్లయ్యింది. సిటీలో మంచిగా సెటిల్ అయ్యారు. హ్యాపీగా సాగుతోందని అనుకున్న వారి జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ...మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నామంటూ.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. గురుగ్రామ్ లో జరిగింది ఈ ఘటన. శనివారం ( అక్టోబర్ 17 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కేరళకు చెందిన మహమ్మద్ అస్లాం, ఫర్హానా దంపతులు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అస్లాం తన కొలీగ్స్ కి ఈమెయిల్ పంపాడు. అందులో తాము ఉంటున్న ఇంటి ఓనర్ నంబర్, తల్లిదండ్రుల నంబర్లు రాసి.. మేము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాము. ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు తెలియజేయండి అని ఉంది. ఈమెయిల్ చూసిన అస్లాం కొలీగ్స్ ఇంటి ఓనర్ కి విషయం చెప్పి అస్లాం ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లారు.