టాలీవుడ్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విక్టరీ వెంకటేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' ( AK47 ) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దసరా పండుగ వేళ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ నెల 30న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెంకటేష్ స్వయంగా ప్రకటించారు.
ఆసక్తి పెంచుతున్న కాంబినేషన్..