హైదరాబాద్, వెలుగు: ఏటా నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ(ఆర్పీసీసీ) సమావేశాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్లో జరగనున్న ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ ఇటీవలే సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఇతర సీనియర్ పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ప్రాంతీయంగా పోలీసు శాఖలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, శాంతి భద్రతల సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి సారించనున్నారు. భద్రతాపరమైన సమస్యల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించడం ఈ సమావేశం లక్ష్యంగా ఉండనుంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు డిసెంబర్లో తిరుపతిలో నిర్వహించనున్న 61వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సుకు కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత…