ఆట పాటలతో సందడి చేసిన మహిళలు..వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి,మాజీ జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి..తెలంగాణ సంస్కృతి చిహ్నం బతుకమ్మ పండుగ అన్న వక్తలు..
విశాలాంధ్ర, శామీర్ పేట్ :- తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ సంబరాలు అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వైభవంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించగా ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. కాగా ఈ వేడుకలకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోమలత, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మాలతి మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ…