వాషింగ్టన్: జ్ఞాపకాల వేడుక అంటే కేవలం పాత పాటలు, వస్త్రధారణ మాత్రమే కాదు.. మన జ్ఞాపకాలు, సంస్కృతి, విలువలతో ముడిపడిన ఒక అందమైన ప్రయాణమని జీడబ్ల్యూటీసీఎస్ మాజీ అధ్యక్షురాలు, తానా ప్రతినిధి సాయి సుధ పాలడుగు అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎంతో ఉత్సాహభరితంగా సాగిన ‘మహిళల జ్ఞాపకాల వేడుక’లో ఆమె మాట్లాడారు. ‘ఇది కేవలం వినోద కార్యక్రమం కాదు.. మన పాతతరం మహానటులు, గాయకులు, కళాకారులకు తెలిపే హృదయపూర్వక కృతజ్ఞత. తమదైన ప్రతిభ, కృషి, పట్టుదలతో కళారంగంలో విశిష్ట స్థానం సంపాదించి, భావితరాలపై చెరగని ముద్ర వేసిన ఆ మహనీయులను మనం ఎప్పటికీ మరువలేం. వారి కళలను గౌరవించడం, వారి స్ఫూర్తిని రేపటి తరాలకు అందించడం…
ఈ వేడుక ద్వారా మన సంప్రదాయాలు, కళలు, సంగీతం, వస్త్రధారణ, కుటుంబ విలువలు వంటి మన మూలాలను మరోసారి స్మరించుకున్నాం. వాటిని గౌరవిస్తూ, పరిరక్షిస్తూ భావితరాలు తమ కొత్త ఆలోచనలతో వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది తానా మహాసభల్లో పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గానం, నృత్యం, నటన, నృత్య రూపకల్పన వంటి అనేక కళాప్రతిభలను ప్రదర్శించేందుకు విస్తృత అవకాశాలు కల్పించనున్నాం. తానా కేవలం ఒక వేదిక కాదు. మన మూలాలను కాపాడుతూ మన సంస్కృతిని ఘనంగా జరుపుకొంటూ మన ప్రతిభను భావితరాలకు అందించే సజీవమైన కుటుంబం. మన మూలాలు బలంగా ఉంటేనే, మన భవిష్యత్తు మరింత ఉజ్వలంగా…