ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టిన అంకిత తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే, కొన్ని గంటల అనంతరం వారిని పోలీసులు విడుదల చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. అంకిత హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దుష్యంత్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తల్లిదండ్రులు బుధవారం ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు. వీరికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అంకిత తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న…