స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. 2026 నవంబర్లో ఈ జోడీ పెళ్లి చేసుకోబోతున్నారు. కావ్య మారన్ ఫ్యామిలీ ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు షురూ చేసింది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త తెగా వైరల్ అవుతోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కావ్య-అనిరుధ్ల వివాహానికి ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
కోహ్లీతో పాటు ఎమ్మెస్ ధోనీ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆహ్వానితుల జాబితాలో కోహ్లీ పేరు ఉన్నదా లేదా అనే విషయంపై మారన్ కుటుంబం నుండి గానీ, కోహ్లీ తరపున గానీ ఎటువంటి స్పష్టత రాలేదు. అనిరుధ్తో పరిచయం కారణంగా ధోనీ వీరి పెళ్లి లేదా రెసెప్షన్కు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.