Antibiotics | యాంటీబయాటిక్ మందులకు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు మరింత సమర్థవంతమైన చికిత్సలను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు కీలకమైన కొత్త విషయాన్ని కనుగొన్నారు. బ్యాక్టీరియాపై దాడి చేసే వైరస్లు తమలోని రక్షణ వ్యవస్థను ఎలా అప్రమత్తం చేస్తున్నాయో తాజా పరిశోధన వెల్లడించింది. బ్యాక్టీరియాను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే బ్యాక్టీరియోఫేజ్ వైరస్‌లను ఉపయోగించే చికిత్సా విధానాన్ని ఫేజ్ థెరపీ అంటారు. ఈ విధానం ద్వారా హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. అయితే, వైరస్ల దాడిని ఎదుర్కొనేందుకు బ్యాక్టీరియాకు కూడా సొంత రోగనిరోధక వ్యవస్థలు ఉండడంతో చికిత్సలో సవాళ్లు ఎదురవుతున్నాయి.…
ఈ అధ్యయనం బ్యాక్టీరియాలోని సీబీఏఎస్ఎస్ (CBASS) అనే రోగనిరోధక వ్యవస్థపై దృష్టి సారించింది. వైరస్ దాడి జరిగినప్పుడు ఈ వ్యవస్థ అప్రమత్తమై, అవసరమైతే సోకిన బ్యాక్టీరియా కణం తనను తాను నాశనం చేసుకునేలా చేస్తుంది. దీనివల్ల వైరస్ ఇతర సమీప కణాలకు వ్యాపించే అవకాశాన్ని అడ్డుకోవచ్చు. అయితే, ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా కణమే నశిస్తుంది కాబట్టి నిజమైన వైరస్ ముప్పును గుర్తించినప్పుడే ఈ వ్యవస్థ పనిచేయడం అత్యంత కీలకం. వైరస్ ఉత్పత్తి చేసే ప్రోటీజ్ అనే ఎంజైమ్ బ్యాక్టీరియా కణంలోని ఒక ముఖ్యమైన గుర్తింపు ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మార్పే హెచ్చరిక సంకేతంగా పనిచేసి…