ప్రపంచవ్యాప్తంగా అప్పులు తీసుకున్న దేశాలకు పాకిస్తాన్ లీడర్ అయ్యింది. మీరు విన్నది నిజమే.. స్వయంగా ఐక్యరాజ్యసమితి మద్దతుతో ప్రపంచ రుణగ్రహీతల క్లబ్ కు పాకిస్తాన్ అధ్యక్షత వహిస్తోంది. ప్రపంచ బ్యాంకునుంచి, ఇతర సంస్థలనుంచి అప్పులు తీసుకోవడం ఎలా? అప్పుల నిర్వహణ, అప్పులపై సలహాలు సూచనలు వంటి అంశాలపై చర్చించేందు వేదికకు పాకిస్తాన్ అధ్యక్షత వహిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతుతో ఏర్పాటైన బారోవర్స్ ప్లాట్ఫాం (రుణగ్రహీతల వేదిక) గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది.
ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ప్రకటించుకంఉది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకారం.. అక్టోబర్12న బ్యాంకాక్ లో జరిగిన సమావేశంలో పాకిస్తాన్ ఆర్థికమంత్రి ముహమ్మద్ ఔరంగాజేబ్, బారోవర్స్ ప్లాట్ ఫాం గవర్నింగ్కౌన్సిల్ అధ్యక్ష పదవిని స్వీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు అప్పుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం, అనుభవాలను పంచుకోవడం, నిపుణుల సలహాలు పొందడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (UNCTAD) దీనికి కార్యదర్శిత్వ సహకారం అందిస్తోంది. అప్పులపై పారదర్శకత పెంచడం, ఆర్థిక సంస్కరణలు చేపట్టడం, అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణపై అవగాహన పెంచుకోవడం కూడా దీని…