ఇల్లెందు, అక్టోబర్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, భూ రీ సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఇల్లెందు ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు, మామిడి గుండాలలో భూ రీ సర్వే పనులు, జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు సంబంధించి చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16…
అనంతరం ఇల్లెందు మండలం మామిడి గుండాలలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతి, భూముల విస్తీర్ణం, గతంలో జారీ చేసిన పట్టాలు, భూ రికార్డులు, సరిహద్దుల నిర్ధారణకు సంబంధించిన వివరాలను సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి పాత రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించి, గతంలో పట్టాలు జారీ చేసిన భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూముల హద్దుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, సంబంధించిన వివరాలను…