న్యూఢిల్లీ: ఇద్దరు ఆర్మీ అధికారుల భార్యలతో వివాహేతర సంబంధాలున్నట్లు ఆర్మీ మేజర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్ట్ మార్షల్‌కు బదులుగా పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని ఆర్మీ భావించింది. ఆ మేజర్‌ను సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. (Army Intends To Sack Major) 2023 ఆగస్ట్‌లో ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని అదనపు క్రమశిక్షణ, నిఘా డైరెక్టరేట్ జనరల్‌కు ఒక మేజర్ భార్య ఫిర్యాదు చేశారు. వ్యభిచారం, మాదకద్రవ్యాల వినియోగంతో పాటు ఇద్దరు ఆర్మీ అధికారుల భార్యలతో సహా నలుగురు మహిళలతో తన భర్తకు సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఆ ఏడాది అక్టోబర్‌లో ఈ ఆరోపణలు…
కాగా, తనపై వచ్చిన ఆరోపణలను తొలి నుంచి ఆ మేజర్ ఖండించారు. తనపై విచారణ వల్ల ఆర్మీ రూల్ 180ను సైన్యం ఉల్లంఘించినట్లు ఆరోపించారు. తాను పదేపదే అభ్యర్థించినప్పటికీ ఆరోపణలలో పేర్కొన్న మహిళలను, వారి భర్తలను ఎప్పుడూ విచారించలేదని ఆయన పేర్కొన్నారు. తన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లతో సహా తన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న విధానంలోనూ, తన నివాసంలో జరిపిన సోదాలలోనూ విధానపరమైన అవకతవకలు జరిగాయని ఎత్తిచూపారు.