ATA bathukamma celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది మెల్బోర్న్ నగరంలో ఏకంగా 6000 మందికి పైగా తెలంగాణ బిడ్డల సమక్షంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పూలతో గౌరమ్మను పేర్చి, ఆటపాటలతో ఆడబిడ్డలంతా కలిసి ఆస్ట్రేలియా గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు.