వేల పరిమళాలను చిమ్మెడు నానావర్ణ శోభిత కుసుమాలంకృతయై చెలిమి కలుముల వరదాయినిగా తెలంగాణ సంస్కృతీ విభవమై ఏటికేడు అవతరించే రంగుల పొదరింటి జవ్వని మా బతుకమ్మ!
అతివల కరకమల శబ్దవిన్యాసాలు గలగలలుగా గాజుల ఒయ్యారాలు గాలికి ఊతమిచ్చి సాగే గానకోకిలల గాంధర్వ రాగాల కోలాటాల ఆర్భాటాలలో పసుపు గౌరమ్మగా ఇంటింటి గడపలో ఒంటిగా విరబూసి సమూహమై వరలు స్నేహదీప్తి మా బతుకమ్మ!