కౌలాలంపూర్ : కౌలాలంపూర్లో మలేషియా (Malaysia ) తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, జానపద కళలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వేడుకలకు మణియిల్ ఫస్ట్ సెక్రటరీ భారత హైకమిషన్ రాజేష్ హెచ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ జానపద నృత్య కళాకారిణి జనుల్యూరి, ప్రముఖ జానపద గేయ రచయిత , గాయకుడు దిలీప్ దేవ్గన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరుణ్ కొలుగూరి పాల్గొన్నారు. మలేషియాలోని వివిధ ఇండియన్ అసోసియేషన్ల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరై తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించారు.