Bathukamma : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ-దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుంచి రెండు వేలకుపైగా ప్రవాస భారతీయ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిధులుగా ఎంపీ రూత్ క్యాడ్బరీ, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌన్స్లో మేయర్ రణ్జిత్ గిల్, హౌన్స్లో కౌన్సిల్ నాయకుడు శాంతను రాజావత్ విచ్చేశారు. ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ నేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, అదే స్పూర్తితో రాష్ట్ర మాజీ మంత్రి…
యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజసేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని వీరి స్ఫూర్తి చాలా గొప్పదని టాక్ బతుకమ్మ సంబరాలకు విచ్చేసిన ముఖ్య అతిథులు అన్నారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెబుతున్న తీరు చాలా గొప్పగా ఉందని చెప్పారు. టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని తెలిపారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న మమ్మల్ని సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు…