Besan Flour | భారతీయ వంటకాల్లో శనగపిండి (బేసన్)కు ప్రత్యేక స్థానం ఉంది. కఢీ, పకోడీలు, చిల్లా, కారప్పూస వంటి చిరుతిళ్లు, శనగపిండి రొట్టెలు, హల్వా తయారీలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. శరీరానికి ప్రోటీన్ అందించే ఆహార పదార్థాల్లో శనగపిండి కూడా ఒకటి. సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. సాధారణంగా శనగపిండిని శనగపప్పుతో తయారు చేస్తారు. దుకాణాల్లో ప్యాకెట్ల రూపంలో సులభంగా లభిస్తున్నప్పటికీ, ఇంట్లోనే కొద్ది నిమిషాల్లో తాజా శనగపిండిని తయారు చేసుకోవచ్చు.
ఇంట్లోనే శనగపిండి తయారు చేసుకునే విధానం చాలా సులభంగా ఉంటుంది. దీనికి 150 గ్రాముల శనగపప్పు, 60 గ్రాముల బియ్యం, 40 గ్రాముల ఎర్ర కందిపప్పు, 40 గ్రాముల పెసరపప్పు అవసరం. శనగపప్పుతోపాటు ఇతర పప్పులు, బియ్యం కలపడం వల్ల పిండి ఆకృతి, రుచిలో మార్పు వస్తుంది. ఈ పదార్థాలను సరైన పరిమాణాల్లో తీసుకుని ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా బాణలిని వేడి చేసి శనగపప్పు, బియ్యం, కందిపప్పు, పెసరపప్పు అన్నింటినీ అందులో వేయాలి. తక్కువ మంటపై నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు పొడిగా వేయించాలి. పదార్థాలు సమానంగా వేగేందుకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా…