ఇండియాలో ఆహార కల్తీ వార్తలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. పెద్దపెద్ద బ్రాండెడ్ కంపెనీలే వీటికి కేంద్రాలుగా మారుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార ఉత్పత్తుల తయారీ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఉక్కుపాదం మోపింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ప్రముఖ సంస్థల బండారాన్ని డిపార్ట్మెంట్ బయటపెడుతోంది. తాజాగా ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీలో పశువుల దాణా ఊకను వాడటం, ప్రసిద్ధ దొడ్ల డెయిరీ పాలలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఆనవాళ్లు బయటపడటం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు…
బిస్కెట్లలో పశువుల దాణా ఊక: ప్రముఖ ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీ సంస్థ అయిన సూర్య ఫుడ్ అండ్ అగ్రో దందా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తనిఖీల్లో బయటపడింది. ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫ్యాక్టరీలో తీవ్రమైన పరిశుభ్రతా లోపాలు బయటపడ్డాయి. ఫైబర్ కోసం మనుషుల వినియోగానికి అసలు పనికిరాని.. పశువుల దాణా ఊకను బిస్కెట్ల తయారీలో ముడిసరుకుగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.