Bomb Threat : ఇజ్రాయెల్ (Israel) లోని టెల్అవీవ్ (Tel Aviv) నుంచి వియన్నా (Vienna) కు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ (Austrian Airlines) కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బల్గేరియా (Bulgaria) రాజధాని సోఫియా (Sofia) లో విమానం సురక్షితంగా దిగింది.
రొమేనియా సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందికి బాంబు బెదిరింపు సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది ఫ్లైట్‌ను సోఫియాకు మళ్లించారు. ఆ విమానం సోఫియాలో ల్యాండ్ అయ్యే వరకు బల్గేరియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌గా వచ్చింది. విమానం దిగిన వెంటనే అందులోని 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.