ముంబై: ఒక కారు గుంతలో పడి అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు నుజ్జు కావడంతో పాటు దాని భాగాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడ్డాయి. అందులో ప్రయాణించిన చిన్నారి సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (Car Hits Pothole, Crash Bus) మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంధర్పూర్-ఖమ్గావ్ జాతీయ రహదారిలోని షిండేవాడి ఫాటా సమీపంలో వేగంగా వస్తున్న స్విఫ్ట్ కారు ఒక గుంతలో పడింది. దీంతో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆ కారు బలంగా ఢీకొట్టింది. ఈ…
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణించిన చిన్నారితో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించగా బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.