అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్
విశాలాంధ్ర,షాద్ నగర్ :రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు చటన్పల్లిలో దేవి శరణం నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చటన్పల్లిలో ప్రతిష్ఠించిన అమ్మవారిని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.…