భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్షన్ కమిటీ (Selection Committee) లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజిత్ అగార్కర్ పదవీ కాలం అక్టోబర్ 4వ తేదీతో ముగియడంతో, వెస్ట్ జోన్ ప్రతినిధిగా, చీఫ్ సెలెక్టర్‌గా రేసులో నిలిచిన మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) అనూహ్యంగా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. అప్లికేషన్ గడువు ముగిసినప్పటికీ పార్థివ్ దరఖాస్తు చేయకపోవడం, ఆర్థిక కారణాలే ప్రధానమని తెలియడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రూ. 3 కోట్ల ఆఫర్ వదులుకున్న పార్థివ్: