Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 19 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయడు భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయ స్థాయి వరల్డ్ అలైన్సీ ప్రిన్సిపాల్ సమ్మేటీవ్ అవార్డు-2026 కు ఎంపికయ్యారు. ఓదెలు కుమార్ 29 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో చేసిన సేవకు గాను ఈ గుర్తింపు లభించింది. ఇతను ఉపాధ్యాయులకు వృత్యంత శిక్షణతో పాటు, సైన్స్ ప్రయోగ దీపికలు, ఉపాధ్యాయుల దీపికలు, వర్క్ బుక్స్, అలాగే టీవీలో పాఠ్యాంశ బోధలను, విద్యార్థులకు నిత్యజీవితం అన్వయించే విధంగా సైన్స్ పాఠాలను బోధించినందుకు ఈ అవార్డుకు ఎంపికైనట్లు జాతీయస్థాయి అవార్డు నిపుణులు పేర్కొన్నారు.
ఈ అవార్డును న్యూఢిల్లీలోని లోతు మార్క్ లో ఉన్న కన్వెన్షన్ లో ఈనెల 25 ఆదివారం ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు ఎంపిక పట్ల జిల్లా విద్యాధికారి ప్రశాంత్ రెడ్డి, విద్యాశాఖ నిపుణులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, భగవంతయ్య, జైపాల్ రెడ్డి, ఎంఈఓ జయప్రద, ఇందుర్తి సర్పంచ్ చింతపూల నరేందర్, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, రేకొండ సర్పంచ్ అల్లేపు సంపత్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పిట్టల రజిత, పురస్కార గ్రహిత ఓదెలు కుమార్ కు అభినందనలు తెలిపారు.