చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్, బీఫార్మసీ, పాలిసెట్ కళాశాల విద్యార్థులు, మహిళ అధ్యాపకులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు. ఈ వేడుకల్లో వైద్యుడు సుభాష్, ఆయుష్ వైద్యురాలు సుశీల, మిట్స్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ మధిర ప్రీతిరెడ్డి, వైస్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం