Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
China: భర్త హగ్.. విరిగిన భార్య ఎముకలు
By Eenadu||2 min read at Eenadu
In brief
According to reports, a woman in China's Jiangsu province suffered broken ribs and a bone fracture after her husband hugged her.
Medical professionals suspect the injuries were caused by severe osteoporosis, which the woman developed due to her recent weight-loss diet and lack of sunlight exposure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బరువు తగ్గేందుకు రాత్రి భోజనం మానేస్తున్న ఓ మహిళకు అనూహ్యంగా తీవ్ర గాయాలయ్యాయి. భర్త ప్రేమగా కౌగిలించుకోవడంతో ఆమెకు ఐదు పక్కటెముకలు విరగ్గా.. మరో ఎముకకు పగులు ఏర్పడింది. ఈ ఘటన జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నట్లు చైనా (China) మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వాంగ్ అనే వ్యక్తి తన భార్య చలిగా ఉందని చెప్పడంతో ఆమెను ప్రేమగా కౌగిలించుకున్నాడు. అయితే, ఆ వెంటనే ఆమె తీవ్ర నొప్పితో విలవిల్లాడుతూ కింద కూర్చుంది. మొదట నొప్పిని భరిస్తూ రాత్రంతా గడిపిన ఆమె.. మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, ఆమెకు ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరో ఎముకకు పగులు ఏర్పడినట్లు గుర్తించారు. దీనిపై వాంగ్ మాట్లాడుతూ.. తాను సాధారణంగానే భార్యను కౌగిలించుకున్నానని, అంతటి తీవ్ర గాయాలు అవుతాయని ఊహించలేదని తెలిపారు. ఆమె బరువు సుమారు 50 కిలోలు ఉంటుందని.. బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఈ మధ్య ఆమె తరచూ రాత్రి భోజనం మానేసి కప్పు కాఫీతో సరిపెట్టుకుంటోందని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)