మక్తల్, అక్టోబర్ 15 : భీమా ఫేజ్-1లో అంతర్భాగమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిన్న గోప్లాపూర్ స్టేజ్-1 పంప్‌హౌస్‌లో మూడు మోటర్లను నీటిపారుదల శాఖ అధికారులు గురువారం ఆన్ చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి సాగునీటిని తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భీమా ఫేజ్-1 పంప్‌హౌస్ స్టేజ్-1 నుంచి మూడు మోటర్లను నడిపితే నీటి విడుదల ఎలా ఉంటుందన్న విషయమై రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి పరిశీలించారు. మూడు మోటర్ల ద్వారా 2,050 క్యూసెకుల నీరు స్టేజ్-1 నుంచి పంపింగ్ అవుతున్న నీరు.. గ్రావిటీ మీదుగా భూత్పూర్ రిజర్వాయర్‌కు చేరే వరకు కాలువను పరిశీలించారు.…
భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ లిఫ్ట్‌నకు నీటిని తీసుకువెళ్లేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు, భీమా ప్రాజెక్టులోని స్టేజ్-1 చిన్న గోప్లాపూర్ పంప్‌హౌస్ నుంచి నీటిని తరలించే గ్రావిటీ కెనాల్ సామర్థ్యాన్ని పెంచాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. అప్పుడే పంప్‌హౌస్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్‌కు నీళ్లు చేరుతాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం సాయంత్రం చిన్న గోప్లాపూర్ వద్ద మోటర్లు ఆన్ చేస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం అక్కడికి చేరుకొని పెంటారెడ్డితో చర్చించారు. ఈ ప్రాంతం నుంచి కొడంగల్…