మెగాస్టార్ చిరంజీవి అంటేనే స్టైల్, స్వాగ్, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. వయసు పెరుగుతున్నా ఆయనలోని జోష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న 'కాకా' సినిమా నుంచి లీకైన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు మేకర్స్ రహస్యంగా ఉంచిన చిరంజీవి యంగ్ లుక్ బయటకు రావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో మెగాస్టార్‌ను చూసి 'ఎవరీ కొత్త హీరో?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సిగార్‌తో మెగాస్టార్ స్టైలిష్ స్వాగ్..