నకిరేకల్ (నల్గొండ ) : రాష్ట్రంలో నిరుద్యోగులకు ( unemployed ), విద్యావంతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ( Chirumarthi Lingaiah ) పిలుపునిచ్చారు. నకిరేకల్, కేతపల్లి మండలాలలో పట్టభద్రుల ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టభద్రులు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు . ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉండాలన్నారు. నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతీయువకులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి అందిస్తామన్న హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.