దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టనున్న ‘లెహ్రా దో తిరంగా మార్చ్’పై ఉత్కంఠ నెలకొంది.జంతర్‌మంతర్ వద్ద జరిగిన అరెస్టులకు నిరసనగా పార్టీ శుక్రవారం (అక్టోబర్ 16) తిరంగా మార్చ్‌కు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో కన్నాట్ ప్లేస్‌లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163ను అమలు చేస్తున్నారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో నిరసన…
రెండు రోజుల పాటు సెంట్రల్ పార్క్ మూసివేతఅయితే, ఈ నిరసనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.నిరసనను పూర్తిగా నిషేధించేందుకు న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పిలుపు మేరకు అక్టోబర్ 16న సెంట్రల్ పార్క్ వద్ద జరగాల్సిన ఆందోళనకు సంబంధించి కీలక నిబంధనలను ప్రకటించారు.పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.కేవలం 11 మంది మాత్రమే జాతీయ జెండాలు పట్టుకుని, జాతీయగీతాన్ని ఆలపించేందుకు అనుమతిస్తామని తెలిపారు.ఈ నేపథ్యంలో సెంట్రల్ పార్క్‌ను రెండు రోజుల పాటు…