జోగుళాంబ గద్వాల : పంట చేతికి వస్తుందన్న ఆశతో లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులకు సాగునీటి కొరత శాపంగా మారుతోంది. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లలో నీరు తగ్గిపోవడం, ఎండ తీవ్రతతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలాలకు తరలిస్తున్నారు. అయినా పంటలకు సరిపడా నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలో పలువురు రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి, అర్ధరాత్రి వేళల్లోనూ ట్రాక్టర్లతో పొలాలకు తరలిస్తున్నారు. దీనికి ఉదాహరణగా గ్రామానికి…
మిరప పంటకు నీరు అందకపోవడంతో ఇటీవల మూడు కొత్త బోర్లు వేయించినా నీరు లభించలేదు. ప్రస్తుతం రోజుకు సుమారు పది ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తూ పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. కాగా, గ్రామంలోనే కాకుండా మండలంలోని పలు ప్రాంతాల్లోనూ రైతులు బోర్లు విఫలమై పెట్టుబడులు నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాగు ఖర్చులకు తోడు నీటి కొనుగోలు భారంగా మారడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసవిని తలపించేలా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ, భూగర్భ జలాల శాఖ అధికారులు ఇప్పటి నుంచే రైతులకు నీటి లభ్యతపై అవగాహన కల్పించాలి.