దాచేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో దాచేపల్లి నగర పంచాయతీ నుంచి వైసిపి తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎంపికైన కొప్పుల రవి ఇంట్లో తెలంగాణ మద్యం దొరకడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసే రోజు మద్యాన్ని పంపిణీ చేయడానికి రవి అనుచరుడు బుర్రి అనిల్‌తో పాటు మరికొందరు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై ఖాసింవలి శుక్రవారం తెల్లవారుజామున రవి నివాసంలో తనిఖీలు చేపట్టగా, రూ.64,640 విలువైన 429 మద్యం సీసాలు దొరికాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. రవి, అనిల్‌లను అరెస్ట్ చేశారు. ‘నామినేషన్ సందర్భంగా అందరూ మద్యం పంపిణీ…