హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): దాంపత్య జీవితంలో తలెత్తే చిన్నపాటి గొడవలు, అభిప్రాయభేదాలను మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. విడాకులు మంజూరు చేయాలంటే జీవిత భాగస్వామి ప్రవర్తన తీవ్రంగా ఉండి, వారితో కలిసి జీవించడం సాధ్యంకాని పరిస్థితులు ఉండాలని పేరొంది. స్వల్ప వివాదాల ఆధారంగా వివాహబంధాన్ని రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. 2009లో వివాహమైన దంపతులకు కుమార్తె జన్మించిన తర్వాత భార్య వేధింపులకు పాల్పడుతున్నదంటూ భర్త విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించిన కిందికోర్టు.. దాంపత్య హకుల పునరుద్ధరణకు భార్య దాఖలు చేసిన పిటిషన్పై విచారణ…
భార్య మానసిక సమస్యతో బాధపడుతున్నదన్న భర్త ఆరోపణకు ఎలాంటి ఆధారాలు చూపలేదని ధర్మాసనం పేరొంది. భార్య, అత్తమామలు ఇల్లరికం రావాలని పట్టుబట్టారన్న ఆరోపణకూ ఆధారాలు లేవని తెలిపింది. గృహహింస కేసు పెట్టి వేధించారంటూ భర్త విడాకులు కోరినప్పటికీ, భార్య కేసు దాఖలు చేయడాన్ని మాత్రమే క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టంచేసింది. గృహహింస కేసును కొట్టివేసినప్పటికీ, నిర్వహణ ఖర్చులు చెల్లించాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది. కేసు దాఖలైన సమయంలో భర్త వయసు 36, భార్య వయసు 30 ఏండ్లు కాగా, ప్రస్తుతం వారి వయసులు వరుసగా 50, 44 ఏండ్లు. కుమార్తెకు 16 ఏండ్లు. దంపతులు 14 ఏండ్ల్లుగా విడిగా ఉంటున్నప్పటికీ, వారి…