దసరా పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ నగరవాసులు భారీ సంఖ్యలో సొంతూళ్లకు పయనమవడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం నుంచి వాహనాలు పోటెత్తాయి. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.పండుగ సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచే ప్రయాణాలు ప్రారంభం కాగా, శనివారం ఉదయానికి రద్దీ మరింత తీవ్రమైంది. విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో టోల్‌ప్లాజా పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సాధారణ రోజుల్లో కొద్ది నిమిషాల్లోనే దాటాల్సిన టోల్‌గేట్‌ను దాటేందుకు గంటల సమయం…