హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : దసరా సెలవులైన ఈ నెల 17 నుంచి 25 వరకు కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని కలెక్టర్లు, హైడ్రాకు ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అయితే, సంబంధిత వ్యక్తులకు చట్టప్రకారం నోటీసులు జారీ చేయడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టంచేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామంలో తన పట్టా భూమిలోని పశువుల కొట్టాన్ని కూల్చివేయడంతోపాటు భూమిని స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సవాలు చేస్తూ ఎస్ లీలావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ…
ఈ నెల 12న స్థానిక ఎమ్మెల్యే భర్త, గ్రామస్తులతో కలిసి వచ్చిన వీఆర్వో కూల్చివేతలపై బెదిరించారని, పట్టా వివరాలను అధికారులకు చూపించినా పట్టించుకోలేదని పేరొన్నారు. ఇరవై ఏండ్లుగా ఉంటున్న భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ భూమికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. ఇదే సమయంలో, ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవుల సందర్భంగా వివాదాస్పద భూముల్లో కూల్చివేతలు, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టు బార్ అసోసియేషన్ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చింది. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో బాధితులకు…