సిటీబ్యూరో,అక్టోబర్17(నమస్తే తెలంగాణ): దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతు న్నారు. ఇప్పటికే చాలామంది కుటుంబాలతో కలిసి పల్లెబాట పట్టగా, మరికొందరు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇండ్లకు తాళాలు వేసి రోజుల తరబడి దూరంగా ఉండే పరిస్థితులను దొంగలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం లేకపోలేదు. గతనెలలో సైబరాబాద్ , మలాజిగిరి పోలీసు కమిషనరేట్ల పరిధిలో చోటుచేసుకున్న వరుస దొంగతనాల నేపథ్యంలో పండుగ సెలవులు పోలీసులకు మరో సవాలుగా మారుతున్నాయి. ప్రజలు పండుగ సంబరాల్లో నిమగ్నమయ్యే వేళ తమ ఇండ్ల భద్రతను విస్మరిస్తే, తిరిగి వచ్చేసరికి విలువైన వస్తువులు మాయమయ్యే ప్రమాదం…
తాళం కనిపిస్తే చాలు.. రెకీ చేసి మరీ చోరీలు! నగరంలోని అపార్ట్మెంట్లు, కాలనీలు, విల్లాలు, శివారు ప్రాంతాల్లోని నివాస గృహాలే దొంగల లక్ష్యంగా మారే అవకాశం ఉంది. ఇంటికి తాళం వేసి ఉందా? వరుసగా ఎన్ని రోజుల నుంచి ఎవరూ రావడం లేదా? పరిసరాల్లో కదలికలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను గమనిస్తూ రెకీ చేసే దొంగలు, అనువైన సమయం చూసుకుని చోరీలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన నార్సింగి చడ్డీ గ్యాంగ్ ఘటన, హయత్నగర్లోని నగల దుకాణం చోరీ, ఇళ్లలో జరిగిన వరుస చోరీలు తదితర వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం.