Dasoju Sravan | తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు, ఎల్‌నినో పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ తప్పిదమేనని మండిపడ్డారు.
ఎల్‌నినో, కరువు పరిస్థితులపై వాతావరణ శాఖ ఏప్రిల్‌లోనే హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు నిద్రపోయిందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. వర్షకాలం ముగిసి పంటలు ఎండిపోయాక జీవో నెం.1523 ద్వారా కేబినెట్ సబ్ కమిటీని వేయడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తూ 1,000 టీఎంసీలకు పైగా ప్రాణహిత వరద నీటిని సముద్రం పాలు చేశారని ఆరోపించారు. విద్యుత్ డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేయలేక రోజుకు రూ. 42.92 కోట్ల ప్రజాధనాన్ని అధిక రేట్లకు కొనుగోలు చేస్తూ తగలేశారని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సబ్ కమిటీ సభ్యులకు బహిరంగ లేఖను రాశారు. అందులో 23…