ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన డీప్‌ఫేక్ ఘటనపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారాన్ని కేవలం ఒక ఘటనగా చూడకూడదని.. భవిష్యత్తులో ఎదురుకాబోయే ప్రమాదాలకు ఇది ఒక హెచ్చరికగా భావించాలని అన్నారు.సినిమాల విడుదలకు ముందు ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేసే వారి గురించి కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.డీప్‌ఫేక్ వీడియోలపై రామ్ పోతినేని చేసిన వ్యాఖ్యలను విష్ణు ప్రస్తావించారు. ఆన్లైన్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న రామ్ సూచనపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎప్పటికీ గౌరవించాల్సిందేనని.. అయితే అదే స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని అజ్ఞాతంగా ఉంటూ ఇతరులను…
సమస్య పూర్తిగా పరిష్కారం కాదుఒక వీడియోను తొలగించడం లేదా ఫిర్యాదు చేయడం ద్వారా డీప్‌ఫేక్ సమస్య పూర్తిగా పరిష్కారం కాదని విష్ణు పేర్కొన్నారు.తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌తో పాటు చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలు కలిసి ఏఐ డీప్‌ఫేక్‌లు, ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో సినిమాలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన కోరారు.ఇందుకోసం శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.