భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం 'రామాయణ'. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఎపిక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు మేకర్స్ . ఈ సందర్భంగా బ్లోయింగ్ ప్రోమోను విడుదల చేశారు. హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులను కైవసం చేసుకుంది.
ఈ ఇంటర్నేషనల్ ప్రోమోలో శ్రీరాముడిని ఒక దేవుడిగా కాకుండా "రావణుడి రాక్షసత్వాన్ని అంతమొందించడానికి అవతరించిన సామాన్య మానవుడు" గా పరిచయం చేయడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రోమోలో అసుర రాజు రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఎంట్రీ, దేవేంద్రుడి (కుణాల్ కపూర్) వాహనమైన ఐరావతాన్ని నేలకేసి కొట్టే విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక శ్రీరాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్ "నేను అతడిని ఆపకపోతే ఈ ప్రపంచం నాశనమవుతుంది" అంటూ చెప్పే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.