రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.కోటా జిల్లాలోని దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వేపై శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఖాటు శ్యామ్ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదంపోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.వీరు భోపాల్ నుంచి రాజస్థాన్లోని ఖాటు శ్యామ్ ఆలయానికి దర్శనం చేసుకునేందుకు బయలుదేరారు.ఈ క్రమంలో కోటా జిల్లాలోని దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వేపై బస్సు ప్రమాదానికి గురైంది.డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో మినీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.