తెలంగాణ ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీతో తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 19 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.