తెలివిగా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు సంపాదించవచ్చని గతంలో కేసీఆర్ చెప్పారు. తాను స్వయంగా వ్యవసాయం చేసే పెద్ద రైతునని అభివర్ణించుకున్నారు. అంత పెద్ద నాయకుడు చెబితే నిజమేనని చాలామంది నమ్మారు. కానీ ఎకరానికి కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలన్నది మాత్రం ఇన్నేళ్లలో ఎవరికీ అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే కోటి సంపాదన సాధ్యమే కావచ్చని అనిపిస్తోంది. వేలకోట్ల జనం సొమ్ముతో రిజర్వాయర్, భారీ కెనాల్, చెరువులు, నీళ్లు నేరుగా పొలానికి తెచ్చిపోసేలా ఏర్పాట్లు ఉంటే పంట ఆదాయం మొత్తం లాభమే కదా! ఉచితంగా సలహాలిచ్చే వ్యవసాయ నిపుణులు కూడా ఉంటే రాబడి…
కొండపోచమ్మ సాగర్కేలి ఆలేరు భువనగిరి పోయే కెనాల్ఇప్పినమనుకో నీళ్లు డైరెక్ట్ వచ్చి ఫాం హౌస్ లకే పోతయి. ఒక్కొక్కటి ఆరెకరాలు, ఏడెకరాలు, ఎనిమిదెకరాలు మడి ఉంటది. ఆ మడుల చుట్టూ ఊళ్లల్ల మోరీ ఉన్నట్టు సీసీ కెనాల్స్ ఉంటయి. వాటర్ ఇప్పంగనే ఎటుయటు ఎళ్లిపోతయి. మడి మడికి ఇదే గేట్లు ఉంటయి. - శ్రీధర్, రైతు