టెక్ దిగ్గజం, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి తన స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన ఒక్కో షేర్‌ను వచ్చే ఏడాది ఉచితంగా ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.వచ్చే ఏడాది, అమెరికాలోని ప్రతి చిన్నారికి నా స్పేస్ఎక్స్ షేర్లలో ఒకదాన్ని ఇస్తాను. ఇలాంటి వాటిలో ఇది మొదటిది మాత్రమే అని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.2026 జూన్‌లో స్పేస్ఎక్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి వచ్చిన సుమారు నాలుగు నెలల తర్వాత మస్క్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.…