హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావం, తగ్గుతున్న భూగర్భ జలాల నేపథ్యంలో నీరు, కరెంట్వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈసారి నగరంలో సుమారు 29 శాతం తక్కువ వర్షపాతం నమోదుకాగా,16 మండలాల్లో భూగర్భ జలాలు 20 శాతానికి పైగా తగ్గాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రియాంక, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎండీ జితేశ్ పాటిల్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, హైదరాబాద్ జిల్లా బాధ్యతలను తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరాకు కొరత లేదని, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి కుటుంబం నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించుకోవాలని సూచించారు.